UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

Must know facts about vedas (telugu)

మానవాళి అతి పురాతన జ్ఞానానిధి :లోతైన అధ్యయన కారులకు సైతం బలమైన రుజువులు దొరకలేదు వేదాల పుట్టుకను నిర్ధారించడానికి.  వేదాల పుట్టుకను నిర్ధారించడానికి చేసిన ప్రయత్నాలన్నీ  ఈ కింది వాటిగా పేర్కొనవచ్చు. 

-బైబిల్లో చెప్పిన జెనిసిస్ తరువాత సృష్టి మొదలయ్యింది కాబట్టి వేదాలు ఆ తరువాత వచ్చి ఉంటాయి.

 

కొన్ని వేల  సంవత్సారాల క్రితం మనిషి ఆదిమానవుడు కాబట్టి ఆ తరువాత కాలంలో వేదాలు వచ్చి ఉంటాయి.  ఆదిమానవ సిద్ధాంతం, మనిషి కోతులనుంచి పరిణామం చెందాడన్న కథలు కేవలం మనకు పాఠ్య పుస్తకాలలో తప్ప ఇంకో మంచి రుజుఫు, పురాతత్వ  శాఖ నుంచి గాని మరే విభాగం నుంచి గాని ఎక్కడా లేవు.  ఆర్య-ద్రావిడ సిద్ధాంతము, వేదాలలో మంత్రాలు  గొర్ల కాపరుల పాటలు, వంటి మాటలు అన్ని పుకార్లే.   ఈ మిథ్యలన్నీ ముందు ముందు మీకు తేట తెల్లమవుతాయి.

 

-వేదాల పరిభాష ఒక్కోచోట ఒక్కోరకంగా ఉంటుంది, కాబట్టి, ఆయా భాషలొచ్చినప్పుడు వేదాలు వొచ్చి ఉంటాయి.

 

-వేదాలలో గంగా, యమునా సరస్వతి పేర్లున్నాయి కాబట్టి, ఈ నదులున్నప్పుడు వచ్చి ఉంటాయి. ఇదెలా ఉందంటే, మహాభారతం రాసింది ఈ మధ్యకాలంలోనే ఎందుకంటే అందులో అర్జున్సింగ్ మరియు లాల్ కృష్ణ అద్వాణీ వంటి పేర్లున్నాయి.

 

వేదాల పుట్టుకకై చెప్పిన కారణాలన్నీ , కాలం నిర్ణయించి కారణం కోసం వెతికి చెప్పినవే. కంపెనీ లాభాలు ముందు అనుకుని లెక్కలు తరువాత రాసినట్టు.  నిజానికి వేదాలు సృష్టి ఆది నుంచి ఉన్నవే, వాటి పుట్టుక తేదీ ఎవరి వల్ల నిర్ధారించడం సాధ్యం కాదు.

 

వేదాలలో ఒక్క పొల్లు కూడా మార్చలేము. మానవాళి అతి పురాతన జ్ఞాన సంపదను ప్రక్షేపించడానికి సాధ్యం కాదు, పొరపాటున ఎవరైనా చేసినా చాలా సులువుగా ఛేదించవచ్చు.

 

వేదాలలో ఇతిహాసాలు ఉండవు: వేదాలలోని పదాలు వాటి ధాతు రూపాలతో అన్వయనం చేసుకోవాలి కానీ కాలక్రమంలో వచ్చిన పదాలతో కాదు. ఉదా : “గౌ” శబ్దానికి “గమనం” అన్నది మూలార్థము, ఇప్పుడు మనము వాడే గోవు కాదు. మంత్రాలలో వచ్చే ప్రతి గౌ శబ్దమూ గోవు అనే అర్థంలో తీసుకోకూడదు. ఈ విషయం మునుముందు విస్తారంగా తెలుసుకొందాము.

 

వేదాలలో అన్ని విషయాల ప్రాథమిక జ్ఞానం ఉంది , గణిత,రసాయన,భౌతిక, ఆధ్యాత్మిక,వైద్య,సాంఘిక శాస్త్రాలన్నీ ఉన్నాయి.

 

వేదాలు కుల,మత, వర్గ, వర్ణ,లింగ వివక్షలకు అతీతం, కేవలం మన ఉన్నతిని సమర్ధిస్తాయి.

 

వేదాలు మూఢ విశ్వాసాలు, విగ్రహారాధనను,ఛాందసవాదం సమర్ధించవు. మన  కర్మలయందు స్వతంత్రత కల్పించి తద్వారానే ఫలితాలుంటాయని నొక్కి చెప్తున్నాయి.

 

వేదాలలో నిత్య కర్మలు, షోఢశోపచారములు, పూజా విధానము, పరమేశ్వరుని ప్రతిబింబము వంటి వాటి వర్ణన ఏవి లేవు. పరమేశ్వరుని స్తుతి, ధ్యానం గురించి సూక్ష్మంగా ఉంటాయి, వాటినే ఆధారంగా చేసుకుని మన పూజా విధానాలు రూపొందించుకోవచ్చు.

 

వేదాలు సమస్త జీవరాశుల పట్ల సమాన భావం చూపుతాయి. స్వార్థపూరిత ప్రయోజనాలకు వాటిని చంపడం/భక్షించడం వేదాలు ఆమోదించవు.

 

యజ్ఞాలలో పశుబలి, మాంస భక్షణ వంటివి వేదాలలో ఉన్నాయన్న వార్తలు పచ్చి అబద్ధాలు, వేదాధారితము కావు. మిడి మిడి జ్ఞానంతో, సంస్కృత పాండిత్య లోపంతో తదనంతర కాలంలో వచ్చిన ప్రక్షిప్తాలివి.

 

వేదాలు ఇప్పుడు మనం చూసే వ్యావహారిక సంస్కృతంలో కాకుండా వైదిక సంస్కృతంలో ఉంటాయి. అన్ని భాషలకు ఇదే మూలము, మాతృక.

 

వేదాలు అన్ని భౌగోళిక ప్రాంతాలకు, కాలాలకు వర్తిస్తాయి. బైబిల్, ఖురాన్ లా ఒక మతానికో, దేశానికో, కాలానికో బద్ధం కాదు.

 

వేదాల్లోఒకే మంత్రానికి  సామాజిక, ఆధ్యాత్మిక, భౌతిక విషయాల అర్థాలు రావచ్చు.  మంత్రాల వ్యాఖ్యానానికి త్రికరణ శుద్ధి, వేదాంగాలపై పట్టు, సాత్విక జీవన శైలి, నిశిత దృష్టి వంటి గుణాలు తప్పనిసరి. లేకుంటే తమ తమ బుద్ధికి తోచినట్టు వేదాల్లో మద్య పానము, మాంస భక్షణము, పశుబలి, జూదము, స్వార్ధము వంటి సర్వ అవలక్షణాలు చొప్పించే ప్రమాదముంది. అటువంటి మహానుభావుల ఫలితమే సనాతన ధర్మ పతనం.

 

మాక్స్  ముల్లర్, విల్సన్, గ్రిఫిత్ , జోన్స్ వంటి ప్రాచ్య పండితుల అనువాదాలన్నీ చెత్తబుట్టకే  చెందుతాయి.

 

మున్ముందు వెలుబడే వ్యాసాల్లో ఈ అన్నింటిని విశదీకరిస్తూ హేతుబధ్ధ, తార్కిక, శాస్త్రీయ కోణాలతో ఒక సంపూర్ణ దృక్పథంతో వేదాధ్యయనం తద్వారా జీవన సాఫల్యానికి తోడ్పడగలదని ఆశిస్తున్నాము.

 

This article in Telugu has been translated by Ramnarayan Reddy ji.

 

[mybooktable book=”essence-vedas-first-book-world” display=”summary” buybutton_shadowbox=”true”]
Agniveer
Agniveer
Vedic Dharma, honest history, genuine human rights, impactful life hacks, honest social change, fight against terror, and sincere humanism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories