అగ్నివీర్ చాలా ప్రస్పుటంగా వైదిక ధర్మమును సర్వమానవాళి యొక్క మతముగా స్థాపించుటయే తమ ధ్యేయమని ప్రకటించింది. అవును, మేము మత మార్పిడి కేళీలో (పనిలో)  నిమగ్నమై యున్నాము. మేము ఈ ప్రపంచము లోని  ప్రతి మానవుడు వైదిక ధర్మానికి నిబద్ధతను ప్రకటించాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ వైదిక మతాన్ని ఆహ్వానించి ఆశ్రయిస్తారో అప్పుడు మాత్రమే ఈ ప్రపంచమునకు ముక్తి లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఇంతే కాక వైదిక ధర్మము తప్ప ఇంకేదీ భగవంతుడికి ఆమోదయోగ్యము కాదని కూడా మేము ఉద్ఘాటిస్తున్నాము. కనుక శాశ్వత ఆనందము కొరకు, ఇప్పుడు, ఇకపైననూ పొందుటకు వైదిక ధర్మమునకు శరణాగతి చేయటం తప్ప వేరే మార్గము ఉండబోదు.

ఇలా చెప్పటం మత  మార్పిడి చేయువారి మాటల వలె  వున్నది కదా! దాదాపు పిడివాదము చేసే క్రైస్తవ, ముస్లిం మత ఛాందస సంస్థల (మిశనరీలు, మదరాసాలు) చేయు పనులు, వ్రాసే వ్రాతల మాదిరిగానే ఉన్నది కదా. పైన చెప్పిన మాటల్లో ‘వైదిక ధర్మం’ అను మాటను తొలగించి ఖురాన్, బైబిల్, ఇస్లాం, క్రైస్తవం వంటి పదాలను ఉపయోగిస్తే – ఈమధ్య కాలంలో మత ఛాందసులైన జాకీర్ నాయిక్, క్రైస్తవ మత  పోప్ లు వంటి వారు కొన్ని శతాబ్దాలుగా ఊదరగొడుతున్న మాటలే ఇవి.

కాబట్టి – సరిగ్గా ఒక ఛాందస క్రైస్తవుడు ఏదో విధంగా అడ్డ దారిలోనో దొడ్డిదారిలోనో బైబిల్ ని ప్రోత్సహించటం, వెనకేసుకు రావటం, ప్రచారం చేసుకోవటం చేసినట్టు, అవసరమైతే ఒక మత ఛాందస ముస్లిం ఖడ్గమునైనా ఉపయోగించి ఖురాన్ ని ప్రోత్సహించటం,  వెనకేసుకు రావటం, ప్రచారం చేసుకోవటం చేసినట్టు – అగ్నివీర్ కూడా వారి మతమే గొప్పదని మిగిలనవన్నీ  పనికిమాలినవని భావించే  ఇంకొక  మత ఛాందస తెగ కాదా? వారు కూడా వేదాలను ప్రచారం చేసుకుంటున్నట్లు, ప్రోత్సహిస్తున్నట్లు కాదా? అగ్నివీర్ కూడా తమ తెగని బలోపేతం చేసుకోవాలనుకునే,  దైవత్వానికి (తమకు తాము ఆపాదించుకొనే) హక్కుదారులుగా ప్రవర్తించే ఇంకొక తెగ వంటి  వారు కాదా?

తప్పకుండా అగ్నివీర్ కూడా వాదించవచ్చు, ఎందుకని క్రైస్తవులకు, ముస్లింలకు మాత్రమే వారి వారి గ్రంథాలని గొప్పవని ప్రకటించుకొనే సర్వ హక్కులు ఉండాలి? వాళ్ళు వారి బైబిల్, ఖురాన్ లను ప్రచారం చేసుకునేందుకు, ప్రోత్సహించేందుకు ఎంతకైనా తెగించగలిగినప్పుడు, అగ్నివీర్ మాత్రం అదే ధోరణిలో వేదాలను ప్రచారం చేస్తే, ప్రోత్సహిస్తే రాద్ధాంతం చేయటం ఎందుకు? మానవ జాతికి వైదిక ధర్మం మాత్రమే సరియైనదని ఉద్ఘాటించటం అగ్నివీర్ యొక్క పిడివాదము అనంటే, అటువంటప్పుడు మిగిలిన అన్ని మతములు, సంప్రదాయాలు, తెగలు అన్నీ ఈ నిందను కూడా భరించక తప్పదు.

ఇదొక బలమైన వాదన. నిజానికి ఇటువంటి వాదనే ప్రపంచములో ప్రధానమైన చాలా మత సంప్రదాయాల, తెగల ఉనికికి కారణము. ఇంకా, కొత్త సంప్రదాయాలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి.

ఈ మా వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వాదనను పట్టుకొని వేలాడుతూ అగ్నివీర్ వైఖరిని సమర్థించుకోవటం ఎంత మాత్రమూ కాదు. దీనికి బదులుగా అసలు వైదిక ధర్మమంటే ఏమిటి, ఎందుకు అగ్నివీర్ సంస్థ, వైదిక ధర్మం కోసం బ్రతికి, తరించి, పరమపదించిన భూమాత సంతానమైన మహానుభావుల యొక్క పెద్ద పరంపరలో మొదటి వారు కాదో వివరిస్తుంది.

ఆ మాటకొస్తే ఈ వ్యాసము, ఎందుకు వేదముల ప్రామాణికంగా ప్రతిన బూనడం, వేరే ఇతర మతములకు చెందిన బైబిల్, ఖురాన్ లేదా ఇంకేవైనా పవిత్ర గ్రంథాల ప్రామాణికంగా చేయు ప్రతిజ్ఞల కంటే వేరైనదో వివరిస్తుంది.

మేము ఇంకా సవాలు చేయగలం, ఈ వ్యాసం చదివిన తరువాత మీరెవరైనా కూడా మీ అంతరంగంలో,  ఈ వైదిక ధర్మాన్ని స్వీకరించేందుకు ప్రేరేపితులై సంసిద్ధులు అవుతారు. వాస్తవానికి దాదాపుగా మనలోని చాలా మంది ఇప్పటికే వైదిక ధర్మం యొక్క అనుచరులే, ఇంత  వివరంగా ఆ విషయాన్ని ఒప్పుకోక పోవచ్చు గాని, ఇది నిజం. కనుక ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం అంతా కూడా మీ నిజ స్వరూపానికి మీరు సక్రియాత్మకంగా సామీప్యానికి వస్తూ, తిరస్కరించ వీలులేని నిజాన్ని తిరస్కరించకుండా ఉండేందుకు మిమ్మల్ని పురిగొల్పుటయే!

మతము అనగా నేమి?

ముందుగా అసలు మతము అంటే ఏమిటో నిర్వచించుకుందాం. సహజంగా మతము యొక్క భావన ఎలా ఉంటుందంటే అదొక సంప్రదాయము లేక నమ్మకాల ఆరాధన వ్యవస్థ అయి ఉండి, ఒక చెప్పుకోదగిన సంఖ్యలోని జనాభా (ప్రజల) చేత అనుకరింపబడుతున్నదై వుంటుంది. అటువంటి వ్యవస్థకి జీవనము, మరణము, మరణానంతర జీవనము, దైవము, మొదలైన విషయాల గురించి కొన్ని విశిష్టమైన నమ్మకాలు ఉంటాయి.

మతము యొక్క నిర్వచనము ఇదే గనుక అయితే ‘వైదిక మతం (ధర్మం)’ ఇటువంటి మతం ఎంత మాత్రమూ కాదు, ఇది తప్ప ఇంకేదైనా కావచ్చు. ఏదేమైనప్పటికీ ‘మతము’ అనే పదాన్ని ఆంగ్లంలో విశ్లేషిస్తే, అది రెండు పదముల నుండి ఉద్భవించినట్లు తెలుస్తుంది. ‘రి’ అంటే ‘మరలా’, ‘లిజియన్’ అంటే ‘కలయిక’ అనే పదముల నుండి ‘రిలిజియన్’ (మతము) పుట్టినట్లు అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ పదానికి ‘యోగ’ అనే సంస్కృత పదముతో చాల వరకు పోలిక కలిగియున్నది! మతము అను శబ్దమునకు ఇదియే సరైన అర్థమయితే , మేము ఏ విధంగా వైదిక ధర్మం (వైదిక మతం) ఒక నిజమైన మతమో చూపించగలము. మతమును నిర్వచించుటకు వేరే ఇతర పోటీదారులుంటే వారికే ఈ విషయం పై తర్కించేందుకు, వారి దృష్టికోణాన్ని వివరించుకునేందుకు వదిలి వేద్దాం.  వాటిపై మనం విమర్శలు చేయటం అనవసరం. ఈ వ్యాసం వైదిక ధర్మమును అర్థం చేసుకునేందుకు, అటువంటి ప్రయత్నంలో మిమ్మల్ని సక్రియాత్మకంగా వైదిక ధర్మ ప్రతిపాదకులుగా మార్చుటకు పరిమిత మైనది.

(గమనిక: భాషా నిపుణులు ‘మతము’ అను శబ్దమునకు పలు ప్రత్యామ్నాయ అర్థాలు, వివరణలు, వ్యాఖ్యానాలు ఉన్నాయని వాదించవచ్చును. ఇక్కడ మనకు ఉద్దేశం ముఖ్యము గానీ శబ్దార్థము కాదు. మీకు వేరుగా అనిపిస్తే, వెరే ఏదైనా పదమును ఈ భావాన్ని వ్యక్త పరచుటకు ఉపయోగించవచ్చు. మేము ‘మతం’ లేదా ‘ధర్మం’ అని ఉపయోగిస్తాం. ఎందుకంటే అవి చాలా ప్రజాదరణ కలిగినవి మరియు సులభముగా అర్థం చేసుకోదగినవి. భారతీయ సంస్కృతిని అర్థం చేసుకోగలిగిన వారికి ‘ధర్మం’ అనే పదం ఈ భావాన్ని వ్యక్త పరచుటకు శ్రేష్టమైన ఎంపిక. ‘ధర్మం’ అంటే సహజ లక్షణము అని అర్థం. మనం ధర్మం గురించి ఇంకెప్పుడైనా చర్చిద్దాం).

వైదిక ధర్మము (మతము) అనగానేమి?

కొన్ని తప్పుడు సమాధానాలను (అపోహలను) ముందుగా పరిశీలిద్దాం.

సమాధానం-1: వైదిక మతము (ధర్మం) అంటే హిందూత్వము.

సమాధానం-2: వైదిక ధర్మమంటే నాలుగు వేదములను పవిత్ర గ్రంథములుగా విశ్వసించటం – ఏ విధంగా ముస్లింలు, క్రైస్తవులు, ఖురాన్, బైబిల్ లాంటి మత గ్రంథాలను పవిత్రమైనవిగా భావిస్తారో ఆ విధంగా భావించటం.

సమాధానం-3: వైదిక ధర్మమంటే నాలుగు వేదాలలోని విషయాలని తు.చ. తప్పకుండా పాటించటం. ఏ విధంగా ముస్లింలు ఖురాన్ లోని విషయాలను, క్రైస్తవులు బైబిల్ లోని విషయాలను తు.చ. తప్పకుండా ప్రతి పదాన్నీ పాటించాలని ప్రయత్నిస్తారో ఆ విధంగా చేయటం.

సమాధానం-4: వైదిక మతమంటే ఆర్య సమాజాన్ని అనుకరించటం (అనుసరించటం).

సమాధానం-5: వైదిక ధర్మమంటే సంధ్యా వందనం, హోమములు వంటివి చేయటం (అగ్నిహోత్రం, పూజ మొదలైనవి).

ఇది సరియైన సమాధానం – “సత్యాన్ని గ్రహిస్తూ అసత్యాన్ని త్యజించటమనే నిరంతర ప్రక్రియతో శాయశక్తులా చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉండటమే వైదిక ధర్మం (మతం)“.

ఇది యజుర్వేదం 1.5 లో చాలా అందంగా వర్ణించ బడియున్నది:

“ఓ మహోన్నత లోక పరిపాలకా (శక్తీ)! ఇసుమంతైనా (స్వల్పంగా నైనా) వికలనాలు లేని సనాతన ధర్మములతో నీవు పని చేస్తూ ఎప్పటికీ అలానే ఉంటావు. నీ నుండి నేను కూడా స్పూర్తిని పొంది నా జీవితములో ధృడ చిత్తంతో ధర్మబద్ధంగా ఉండెదను గాక. ఆ విధముగా నా శాయశక్తులా, నా జీవితములో ప్రతి క్షణమూ, నా అభిప్రాయములలో, ఉద్దేశాలలో, ప్రయత్నములలో, ఎలప్పుడూ సత్యాన్ని అన్వేషిస్తూ, అసత్యాన్ని త్యజిస్తూ ఉండెదనని నిశ్చయించుకుంటున్నాను. ఈ నా ఉన్నత నిశ్చయములో నేను కృతకృత్యుణ్ణి (విజయవంతుడిని) అయ్యెదను గాక.”

మొత్తం వైదిక ధర్మాన్ని ఇది క్లుప్తంగా వివరిస్తుంది. ఇది ఆరంభ దశ, మొదటి మెట్టు. ఇక మిగిలినవన్నీ ద్వితీయ శ్రేణి విషయాలు లేదా దాని సహజ పరిణామాలు. ఈ మౌళికమైన భావన ఎవరికి వుంటే వారు వైదిక ధర్మానుచరులు. ఇది లేకుండా ఇతరములు ఎన్ని ఉన్నా అది వైదిక ధర్మము కాదు.

అసత్యాన్ని త్యజించటమనే భావన (ఉద్దేశం) అనేది మానవుల ప్రధాన లక్షణమను విషయమును మీరు గ్రహించండి. ఈ సామర్థ్యం లేకుండా మనం మనుగడ సాగించలేము. ఈ లక్షణమే మనల్ని నడిచేందుకు, మాట్లాడేందుకు, విద్యని అభ్యసించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేయుటకు మరియు జీవితములో ఎదుగుదల, ప్రగతిని కాంక్షించేందుకు, మనల్ని ప్రేరేపిస్తుంది. మనకి ఈ విషయం అవ్యక్తంగా లేక వ్యక్తంగా తెలియకపోయినా, మనం ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా, మనందరమూ ఈ వైదిక ధర్మమును పాటిస్తున్నాము గనుకనే మనుగడ సాగించగలుగుతున్నాం.

‘ధర్మం’ అంటే ఒక సహజ లక్షణం అని అర్థం.  మతారాధన వ్యవస్థలు, సంప్రదాయాల మాదిరిగా ధర్మమును ప్రజలపై రుద్దుటకు వీలుపడదు, ఎందుకంటే ధర్మము అటువంటిది కాదు.  అది సహజమైనది మరియు అంతర్గతమైనది. కనుక సత్య శోధన అనునది మనందరి యొక్క సహజ లక్షణము, మరియు మనము జీవిస్తూ ఉన్నామనే మౌళిక సత్యము మనము వైదిక ధర్మాన్ని పాటిస్తున్నామని తెలియజేస్తుంది.

కనుక వైదిక ధర్మమును స్వీకరించడం (ఆహ్వానించటం) అంటే మీరు ఇప్పటికే పాటిస్తున్న లేదా చేస్తూ ఉన్న విషయాలను ఒప్పుకోకుండా పైపైన బాహాటంగా ఖండించటం లేదా నిరాకరించటం మానుకోవటమే. ఏవిధంగానైతే నేను గాఢ నిద్రలో ఉన్నానని అరిస్తే ఆ అరుపు అనే నిజము మీరు నిద్రపోవటం లేదని సూచిస్తుందో, అటువంటి బుకాయింపు పనులు చేయక పోవటమే. దీనికి బదులుగా మీలో ఇప్పటికే నిగూఢమైయున్న, శక్తిని, బలమును, ఆసక్తినిచ్చే  శక్తిదాయకమైన సూర్యోదయ కిరణాలను స్వాగతించుటయే.

ఏది సత్యము? ఏది అసత్యము?

ఈ అంశం గూర్చి క్షుణ్ణంగా పరిశీలించే ముందు సత్యము, అసత్యములంటే ఏమిటో క్లుప్తంగా విచారణ చేద్దాం. ఇది ముఖ్యమైన ఆవశ్యకత, ఎందుకంటే చాలా మత సంప్రదాయాలు, ఆరాధన వ్యవస్థలు ‘సత్యం’ యొక్క సర్వహక్కులకు వారి అర్హతను, ఆధిపత్యాన్ని  యాజమాన్యాన్ని ఆపాదించుకునే ప్రయత్నం చేస్తాయి. కొన్ని ఎంతగా స్వాధీనతను కనబరుస్తాయంటే వారి మతములో ఎవరైనా చేరి వారి యొక్క ‘సత్యము’ ను ధిక్కరించే ప్రయత్నం చేస్తే వారికి మరణ దండనను సైతం సిఫార్సు చేస్తాయి.  ఇది ఎలాంటి పరిస్థితంటే మనకు కొన్ని భయానక చలన చిత్రాలలో చూపించబడే మానసిక వైక్లభ్యము కలిగిన భూతముల వలె, వాటి బారిన పడిన బాధితులకు కేవలం చంపబడుటకు లేదా స్వాధీనమగుటకు ఇచ్చిన ఎంపిక అవకాశం వంటిది, ఇంకో ప్రత్యామ్నాయము ఉండదు.

వైదిక సత్యము చాలా నిజాయితీతో కూడుకున్నది. ‘వేద’ అనే పదము ‘విద్’ అనే ధాతువు నుండి ఉద్భవించినది. దాని అర్థం ‘జ్ఞానం’ లేక ‘విద్య’ అనునది. కనుక ఎవరికో సత్యమునకు చెందిన అనుజ్ఞ పత్రము ఉండుట చేత వారు చెప్పినవి అన్ని మీరు నమ్మవలసినదేనని వైదిక సత్యము ఎంత మాత్రమూ సూచించదు. ఏదో ఒక పవిత్ర గ్రంథం అనబడే పుస్తకమో, లేక ఒక ప్రవక్తనో, లేక ఒక అవతార పురుషుడో, లేక ఒక జనరంజకుడో లేక ఒక ఆకర్షక వ్యక్తి లేక ఒక టి.వి. చానెల్ వంటివి వారికి సత్యం తెలుసునని ప్రకటించుకున్నంత మాత్రం చేత మీరు ఏ విషయాన్నీ కూడా నమ్మకూడదు.

వైదిక సత్యం అంటే మీరు ఏ విషయాన్నైనా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకొని, అంగీకరించి తదనుగుణంగా నడచుకోవటమే లేదా ప్రవర్తించటమే.

వైదిక సత్యం అంటే ఏ విషయమైనా మీకు తార్కికంగా, వ్యవస్థీకృతంగా, స్వయం విరుద్ధమైనది కాకుండా ఉండి, అన్నిటికంటే ముఖ్యంగా మీ మనస్సాక్షికి నచ్చేలా ఉండాలి. ఇటువంటి నిజ నిర్ధారణ పరీక్షలేవీ చేయకుండా మీరు దేనినైనా అంగీకరిస్తే అది అసత్యమవుతుంది.

ఉదాహరణకి, ఒక వేళ నేనొక ప్రవక్తనని నేను ప్రకటించుకొని, నన్ను నమ్మడం ద్వారా, నేను అగ్నివీర్ వెబ్సైట్ లో ఏదైతే వ్రాస్తానో దానిని గుడ్డిగా నమ్మడం ద్వారా మాత్రమే మీ బాధలన్నీ తొలగి పోయి మీరు స్వర్గాన్ని పొందెదరని నేను నమ్మబలికితే, మీరు నా ఈ ప్రటనని/ఉద్ఘాటనని పలు విధాలుగా పరీక్షించి చూడాలి. మచ్చుకు కొన్ని ప్రశ్నలు:

 1. వేరే ఎవరైనా కూడా ఇలాగే ఉద్ఘాటిస్తే ఎలా? నేను ఏ విధంగా ఎవరు తప్పో, ఎవరు ఒప్పో నిజ నిర్ధారణ చేసుకోగలను?
 2. అగ్నివీర్ వెబ్సైట్ లోని అన్ని విషయాలు సమగ్రంగా దోష రహితమైనవేనా? ఇవి కాలము లేక భౌగోళిక ప్రభావముల చేత మార్పు చెందనివేనా?
 3. అగ్నివీర్ వెబ్సైట్ ఆవిర్భవించక ముందే చనిపోయిన వారి సంగతేమిటి? వారెందుకు ఈ ప్రయాణాన్ని చేజార్చుకున్నారు?
 4. అగ్నివీర్ వెబ్సైట్ లో ఏవైనా తప్పులు ఉన్నాయా?
 5. అగ్నివీర్ వాళ్ళు ప్రతిపాదించిన విషయాలను అనుసరించుటయే స్వర్గము పొందుటకు మార్గమైతే, మరి నాకు ఎందుకు వేరొక ఆలోచన చేసి విశ్లేషించగల మెదడు, బుద్ధి ఇవ్వబడినవి?

….. మొదలైనటువంటి ప్రశ్నలు మనకి మనం వేసుకోవాలి.

కనుక అగ్నివీర్ వెబ్సైట్ లో చాలా ఉపయుక్తమైన సమాచారం, అంశాలు ఉన్నాయని నిశ్చయానికి వచ్చినా, అగ్నివీర్ ఒక ప్రవక్త అని మీరు అంగీకరించటం అకాలమైన అపరిపక్వమైన విషయం. కనుక మీరు తెలివైన వైదికులు అయితే అగ్నివీర్ వెబ్సైట్లో ఏదైతే మంచి ఉందో దానిని మాత్రం గ్రహించి, మిగిలిన ఉద్ఘాటనలను పక్కన పెడతారు. మీరు ఇంకా తెలివి కలవారైతే మొత్తం అగ్నివీర్ ప్రతిపాదనలనే తిరస్కరించి, మీకు ఇంకేదైనా జ్ఞాన మార్గము లేదా మూలము తార్కికంగా ఉన్నతమైనదని అనిపిస్తే, అని మీరు నిశ్చయించుకుంటే వాటి నుండి జ్ఞానం పొందుటకు ఆశిస్తారు.

అయితే వైదిక సత్యము మిమ్మల్ని అతి సంశయబద్ధులై యుండి ప్రతి విషయాన్ని మీరు స్వయంగా నేరుగా పరీక్షించ గలిగితేనే అంగీకరించమని కూడా సూచించదు. ఎవరైనా ఇంద్రియముల ద్వారా నేరుగా అవగాహన చేసుకోగలిగిన విషయాలను మాత్రమే నమ్ముదామని అనుకుంటే, అటువంటి వారు ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. ప్రతి ఒక్కరూ వారికున్న తర్కము, బాహ్య నిక్షేపము (ఆంగ్లంలో ఎక్ష్ట్రాపోలేషణ్), అంతర్వేశనం (ఆంగ్లంలో ఇంటర్పోలేషణ్), విచారణ, ప్రతి-విశ్లేషణ, వ్యాఖ్యానం మరియు విచారణ చేయటం వంటి ఉపాధులను ఉపయోగించాలి. ఇది మానవ లక్షణం.

ఉదాహరణకు మీరు ఒక వాహనం (కారు) తరచుగా వాడే వారు అయితే, కారు చెడిపోకూడదని మీరు కారుని నడిపేముందు ప్రతిసారీ 6 గంటల సమయాన్ని వెచ్చించటం ఎంత స్థూలమైన అసమర్థత అవుతుంది! మీరు ఆ కారు గత చరిత్రను బేరీజు వేసుకొని, దానికి సాధారణంగా చేయించవలసిన నిర్వహణ పరీక్షలు, ఇతర పనులు చేయిస్తూ మీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. లేని యెడల, ఈ అతి సంశయ మనస్తత్వమను వైపరీత్యమును మానసిక రుగ్మత అని పిలిచెదరు.

వైదిక ధర్మము మననందరినీ విజయవంతమైన సంస్థల యొక్క చురుకైన, మానసిక వైపరీత్యము వంటి రుగ్మతలు లేని కార్య నిర్వాహణ అధికారులుగా (సి..) ఉండవలెనని ఆశిస్తుంది. ఏవైనా లాభాలు ఉన్నాయనిపిస్తే ఆ విషయం పట్ల వారు చేయగలిగిన ఉన్నత విశ్లేషణల ఆధారంగా సక్రియాత్మకంగా ఆ లాభాలను పొందాలనే ఆశయంతో నుండి, ఒక వేళ ముందు చేసిన విశ్లేషణ లేదా నిర్ధారణ తప్పని తెలిసినా లేక ఇంకేదైనా శ్రేష్ఠమైనది లభిస్తుంది అని అనుకున్నప్పుడు దానికి సుముఖంగా ఉండేవారిలాగా ఉండాలి.

ఇది వైదిక ధర్మమునకు చెందిన సత్యము. దీనికి విరుద్ధముగా నడచుకోవటం అసత్యమవుతుంది.

ఈ వ్యాఖ్యానాన్ని సంగ్రహించేందుకు ఈ విధంగా చెప్పవచ్చు. వైదిక ధర్మమంటే జ్ఞానం లేక వివేకం చేత నడుపబడటమే.

వైదిక ధర్మము యొక్క సహజ పరిణామములు

పైన పేర్కొనబడిన ప్రమాణాలు వైదిక ధర్మం యొక్క ప్రధాన నిర్వివాదాంశములు (సంశయం లేని సత్యము).

ఈ సత్యమును ఒక్కసారి గ్రహించగలిగితే, ఇక మిగిలిన సహజ పరిణామాలన్నీ మనం ప్రగతిని సాధించే కొద్దీ గ్రహించబడుతూ ఉంటాయి. ఇవి గణిత శాస్త్రములో గల ప్రధాన నిర్వివాదాంశముల వంటివి. ఒక్కసారి అవన్నీ అర్థమయితే, అప్పుడు అంక గణితము, బీజ గణితము, త్రికోణమితి, గణవిధానం (కలనము) లాంటి అంశాలు సులువుగా ఆకళింపు చేసుకోబడతాయి.

సూత్రప్రాయంగా చెప్పాలంటే, ఈ ప్రపంచములోని ఏ మనిషైనా గణితములోని అన్ని పురోగతులను అన్వేషించి వాటన్నింటినీ తనకు తానే గ్రహించుకోగలడు. అయితే ఈ ప్రక్రియ చాల దుర్భరమైనది, మిక్కిలి కష్టముతో కూడుకున్నది. కనుక చురుకైన ప్రజలు తమ పిల్లలను పాఠశాలకు పంపుతారు, తద్వారా వారు ఏ వెయ్యి జన్మలో లేక ఇంకా ఎక్కువ సమయము తీసుకోక, అవసరమైన విషయాలను తక్కువ సమయంలో త్వరగా నేర్చుకోగలరు. నాటకీయంగా ఉండే ప్రశ్నల పరీక్ష (క్విజ్) లోని నిపుణుడిలా కాక, గణితంలో ప్రావీణ్యుడు అనిపించుకోవటానికి గణిత సూత్రాలన్నీ కంఠస్తం చేయవలెనన్న ఉద్దేశము ఇక్కడ లేదు. ఒక వేళ దక్షతను పెంపొందించుకునేందుకు అలా కంఠస్తం చేయవచ్చు కానీ, ఖచ్చితంగా అది మాత్రం మన లక్ష్యం కాకూడదు. (a+b)^2 = a^2 + b^2 + 2ab అనే సూత్రము గురించి కేవలము అర్థం తెలుసుకోవటమే కాక, అది ఎలా ఉద్భవించిందో తెలుసుకున్నవాడే గణిత శాస్త్ర ప్రావీణ్యుడు.  అంతే కాకుండా  ఒక సంక్లిష్టమైన గణిత సమీకరణ వ్యుత్పత్తిని, ఏదైనా గణిత పాఠ్య పుస్తకములో ముద్రణ దోషం లేక ఇతర తప్పులతో ఉంటే, దానిని తిరస్కరించేందుకు కూడా మీకు హక్కు మరియు పూర్తీ స్వేచ్ఛ ఉంటాయి.

ఈ విధంగా చేయటమన్నది వైదిక ధర్మమును పాటించటం వంటిది. ప్రతి అడుగు లేక మార్గాన్ని సత్యాన్వేషణ కొరకు పరిశీలించి, పరీక్షించి తరువాత ముందుకు సాగడమే. అలా చేస్తే మీరు త్వరగా మౌళిక (ప్రాథమిక) గణితమునే కాక, అధునాతనమైన (ఉన్నతమైన, క్లిష్టమైన) కలనము (క్యాల్కులస్) పై కూడా పట్టు సాధించగలరు.

ఇక ప్రముఖంగా వేదములు, వైదిక ధర్మం గురించి ఉన్న అవగాహన, దృష్టికోణములు అంతా కూడా అనుబంధమైన విషయాలే. వాటియందు నమ్మకము కలిగి ఉండాలని మిమ్మల్ని బలవంత పెట్టడము ఈ వైదిక మార్గంలో ఉండదు. అవి సాపేక్ష సిద్ధాంతం (రిలేటివిటి) మరియు గమన నియమాల (లాస్ ఆఫ్  మోషన్) వంటివి. మీరు ఎప్పుడైనా వాటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు కానీ వాటిని మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. మీ ఉన్నత సామర్థ్యము, ఆలోచనల మేరకు నిజాయితీగా అవి మీకు పరిగణించ సాధ్యము కాదనిపిస్తే వాటిని మీరు తిరస్కరించవచ్చు లేక వాటిని ప్రతివాదంతో ఎదుర్కొని ఖండించవచ్చు. అప్పటికీ మీరు వైదిక ధర్మమూ పాటించినట్లే అగును.

ఈ అనుబంధ విషయములు వివిధ స్థాయిలలో ఉంటాయి. కొన్ని చాలా ప్రస్పుటమైనవి, అంతర్ దృష్టితో కూడుకున్నవైతే, కొన్నింటికి ఇంకా లోతైన విశ్లేషణలు మరియు ఆత్మ పరిశీలన అవసరం, ఇంకొన్ని పరిశోధన స్థాయి విషయాలుగా ఉండవచ్చు, వాటియందు ప్రావీణ్యులకు భిన్నాభిప్రాయాలు కూడా ఉండవచ్చు. ఇవి పాఠశాలలోని ఒకటవ తరగతి నుండి ఫై.హెచ్.డి. వరకు గల బోధనాంశాల వలె ఉంటాయి. అటువంటి కొన్ని అనుబంధ విషయాలు ఏమనగా:

 • సత్యము సంతోషమునకు మార్గము, అసత్యము దుఃఖములకు దారి తీస్తుంది.
 • సంతోషమును అసత్యము ద్వారా పొందవలెనని చేసే ఏ ప్రయత్నమైనా చివరకు దుఃఖాలకు దారి తీస్తుంది మరియు అదనపు కష్టాలు, చిక్కులు, శిక్షలకు కారణమౌతుంది.
 • ప్రతి ఒక్కరూ సక్రియాత్మకంగా ఈ లోకము యొక్క ఆనందమును ఆశించి దాని కొరకు అన్వేషించాలి. ఆనందము పంచుకునేకొద్దీ వృద్ధి చెందుతుంది.
 • కర్మ సిద్ధాంతము మార్పు చెందనటువంటిది మరియు అది అనుక్షణం పని చేస్తూ ఉంటుంది. మీ ఆలోచనలు మీ వాస్తవాలు అవుతాయి.
 • ఆత్మ సనాతనమైనది (నాశనము లేనిది) మరియు కర్మ సిద్ధాంతమును అనుసరించి ఇంతవరకూ చేసిన కర్మలకు తగిన ప్రతిఫలాలను ఎదుర్కుంటూ అనుభవిస్తూ ఉంటుంది.
 • మార్పునకు ఆస్కారమే లేని నియమాల ద్వారా ఓ అత్యంత అత్యున్నత శక్తి ఈ లోకమును పరిపాలించుచున్నది.
 • నాలుగు వేదాలు సూక్ష్మమైన సత్యములకు సంబంధించిన సంకేతాలను కలిగియున్నాయి.
 • ప్రతి ఒక్కరూ పరిపూర్ణ అభివృద్ధిని కాంక్షించాలి కానీ అసంపూర్ణ, అసమతుల్య అభివృద్ధిని కాదు. మనకున్న ఉపాధులు (ఇంద్రియ శక్తులు) బహు లక్షణాలను కలిగియున్నాయి. అదొక నూరు శాఖలు కలిగిన పాఠశాల వంటి విషయం.

వైదిక ధర్మము యొక్క ప్రధాన సిద్ధాంతాలతో సమానమైన విశిష్టత మరియు ప్రాధాన్యము కలిగిన స్పష్టమైన  కొన్ని అనుబంధ విషయాల గురించి ఇంకా విస్తృతమైన వివరణ కొరకు, ఈ వ్యాసాన్ని చదవండి: http://agniveer.com/1634/religion-vedas . కొద్దిగా తక్కువ సూక్ష్మత కలిగిన వేదం ధర్మ సంబంధిత  అనుబంధ విషయాల గూర్చి విస్తారమైన విశ్లేషణ కొరకు ఈ వ్యాసాన్ని చదివి మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోండి: http://agniveer.com/category/methods/vedas

ఇవన్నీ కొనసాగింపులు లేక అనుబంధములే అన్న విషయాన్ని గమనించండి. మీకు ఇప్పటికే ఉన్న జ్ఞానం, అనుభవాలు, అలవాట్లు మరియు అభిప్రాయాల (దృష్టికోణముల) ఆధారంగా ఈ విషయములలో ఏవైనా మీకు అంగీకార యోగ్యంగా లేకుండుట చేత నమ్మేందుకు మనసొప్పకపొతే, తద్వారా మీరు ఆ విషయాలను తిరస్కరిస్తే, మీకు ఎటువంటి శిక్షలూ, నష్టాలు, బెదిరింపులూ ఉండవు. మీరు ఉద్దేశపూర్వకంగా సహజత్వాన్ని, స్పష్టతని కలిగియున్న విషయాలను, నిజాలను కూడా నిర్లక్ష్యం చేసి ఎప్పుడైతే మరింత విజ్ఞానమును పొందుటకు, మంచి పనులు చేయుటకు నిరాకరించటం, మెరుగైన చింతన చేయటం వంటి తపనలను ఎప్పుడు వదులుకుంటారో, అప్పుడు మాత్రమే మీకు నష్టాలు కలుగుతాయి.

కనుక ఎప్పుడైతే మీరు తప్పు చేస్తున్నాం అని తెలిసి కూడా మీ అంతరాత్మని నిర్లక్ష్యం చేసి ఉద్దేశపూర్వకంగా, వేరుగా అక్రమ మార్గంలో నడచుకుంటారో, అప్పుడు మాత్రమే మీరు వైదిక ధర్మానుచరులుగా ఉండజాలరు. ఒక అవినీతి  రాజకీయ నాయకుడు, ఒక మోసపూరితమైన విక్రేత (అమ్మకందారుడు), ఒక అత్యాచారి, ఒక హంతకుడు వంటి వాళ్లు వైదిక ధర్మ విరోధులుగా పరిగణించేందుకు చాలా స్పష్టమైన ఉదాహరణలు. వీరే కాక మనలో ఎవరైనా కూడా కామము, స్వార్థము, దురాశ, నిరాశ, మాటల్లో చేతల్లో లేక మనసులో కోపముతో ఉండటం వంటి విషయాలకు దాసోహం అయిపోతే, ఈ మన పనులు ఇతరులకు తెలియకపోయిననూ, వైదిక ధర్మమునకు విరుద్ధంగా ప్రవర్తించే వారిగా ఉదాహరణలు అవుతాము.

ప్రతి రోజు మనం వైదిక ధర్మాన్ని వివిధ విషయాల్లో వివిధ స్థాయిలలో పాటిస్తూ ఉంటాము. మనం వందకి వంద సంఖ్యలను (మార్కులను) ఎల్లప్పుడూ అన్ని విషయాలలో సాధించలేము. మనలో చాలా మంది చాలా తక్కువ సంఖ్యను సాధిస్తూ ఉండవచ్చు. అయితే ఆ విషయం మనల్ని తక్కువ వైదికంగా మార్చివేయదు. మనము క్రింద పడిన ప్రతిసారీ పైకి లేవాలని సంకల్పించుకున్నంత వరకూ వైదికులమే. క్రింద పడిపోవటం పాపము కాదు. మనము ఎందుకు పడిపోతామంటే మన అన్ని సంచిత (క్రమముగా ఎంతో కాలము నుండి ప్రోగుచేయబడిన) కర్మలు, ఆలోచనలు మరియు గతములోని అలవాట్లు కారణాలుగా  ఉండి మనల్ని పతనానికి అర్హులని చేస్తాయి. అయితే మనకు ఇప్పుడొక అవకాశం ఉన్నది – పతనమవుతూ  ఉండుటకు లేక ఎదగటానికి నిశ్చయించుకొనుటకు ఎంపిక చేసుకునే వీలుంది.

ఉదాహరణకి, ఈ రోజు మీరు బస్కీలు తీసే వ్యాయామం (పుష్ అప్స్) చేయలేకపోవచ్చు. కానీ మీరొక ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వ్యాయామాన్ని చేయటాన్ని తిరస్కరిస్తూ ఒక రోజుకి మంచి బలిష్టమైన శరీరాన్ని పొందే అవకాశాన్ని చేజార్చుకోవచ్చు. లేదా ముందు మోకాళ్ళు వంచి సులభ వ్యాయామముతో మొదలు పెట్టి క్రమంగా శక్తిమంతులుగా మీరు ఊహించని విధంగా రూపాంతరం చెందవచ్చు కూడా! ఈ రెండవ కోవకి చెందినటువంటి నిర్ణయాలు తీసుకున్నవారైతే మీరు వైదిక ధర్మానుచారులు కాగలరు.

This translation in Telugu has been contributed by Brother Ashok of Team Agniveer. Original post in English is available at http://agniveer.com/what-is-vedic-religion

ఆంగ్ల మూలం: http://agniveer.com/what-is-vedic-religion

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer: We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleWhy I love Vedas! Part-2
Next articleYes, I love I
Agniveer aims to establish a culture of enlightened living that aims to maximize bliss for maximum. To achieve this, Agniveer believes in certain principles: 1. Entire humanity is one single family irrespective of religion, region, caste, gender or any other artificial discriminant. 2. All our actions must be conducted with utmost responsibility towards the world. 3. Human beings are not chemical reactions that will extinguish one day. More than wealth, they need respect, dignity and justice. 4. One must constantly strive to strengthen the good and decimate the bad. 5. Principles and values far exceed any other wealth in world 6. Love all, hate none
 • We liked that Agniveer started publishing articles in Telugu language also. But so far, only two have been published, and there is no progress afterwards. Other language works are relatively better.

  Hope you will start publishing more translated articles in Telugu. Also I notice that with just 1 article, Oriya language category is listed on Agniveer, but for 2 articles of Telugu, the category is not yet created.

  This makes me a little disappointed.

 • Brahmin woman doesn’t want to marry dalit man.
  Brahmin man doesn’t want to marry dalit woman.
  Brahmins never eat food in dalit house.
  What a culture it is?????

  • Vedas clearly have no concept or word called caste. This is invented by evil people. And continue to be propagated by evil people like Christians. It serves Christians to push such ideas. But today Christians have caste as well.

  • I want to make it clear that caste in India is not a religious problem, but a cultural problem. And caste was promoted by the Christian British, so it was easier to rule of the Indians. Also it is the bible that talks about slavery. Quotes from the bible about slavery:

   When a man strikes his male or female slave with a rod so hard that the slave dies under his hand, he shall be punished. If, however, the slave survives for a day or two, he is not to be punished, since the slave is his own property. (Exodus 21:20-21 NAB)

   Slaves, obey your earthly masters with deep respect and fear. Serve them sincerely as you would serve Christ. (Ephesians 6:5 NLT)

   Christ encouraging slaves to be slaves:
   (1 Timothy 6:1-2 NLT) Christians who are slaves should give their masters full respect so that the name of God and his teaching will not be shamed. If your master is a Christian, that is no excuse for being disrespectful. You should work all the harder because you are helping another believer by your efforts. Teach these truths, Timothy, and encourage everyone to obey them

   Krishnarao

  • What you said is true. Many Hindus who belong to Dalit community are being exploited by Christian missionaries by luring them with various benefits.

   But TRUTH is truth, we have to be patient, let people like Agniveer Team do their best, and we as readers of Agniveer will try to spread the real message in Telugu to the people of Andhra Pradesh.

   This is also a fact that Hinduism is mostly misunderstood as a religion with many Gods, many beliefs and sentiments all of which are false.

   If one reads the works of Agniveer and the works of many other great personalities like Swami Dayanand Saraswati’s “Satyarth Prakash (Light of the Truth)”, Swami Vivekanand’s “Complete works”, Sri Rama Chandraji Maharaj’s “Satyodayam’ books, one will find there is a lot in common.

   We like Agniveer for this reason. Apart from some prejudiced people who intend to just comment, many others are really getting enormous amount of knowledge from this site.

   This is evident from the fact that the fanatic religious hackers tried to bring down this site sometime around last year, because their false propaganda about Hinduism and our Sanatana Dharma was demolished through Agniveer’s articles.

   There will be very few people of the caliber and guts of Agniveer who would like to contribute for the greatest cause of standing by the truth and discarding the falsehood in and out of Hinduism.

   • Yes, agniveer is great.Hinduism is way beyond the vulgar rhapsodies called Puranas that some Brahmins installed in place to suck the life of our religion!
    First of all, Hinduism is an UNORGANIZED religion, unlike the Abrahamic religions, who need to install rabbis, padres and moulvis etc. in place to perpetuate their dogmas. It gives total and absolute freedom of religion and belief, as it believes in Yatha Mat Tatha Path (as many minds that many paths). It considers a single human as a religion or sect in his/her own right. So, the role of Brahmins is limited to the various idolatrous, polytheistic and degenerate temple-cults where hindus indulge in all sorts of redundant and even wasteful rituals, as if Brahmins are trying to stoke their bureaucrat God’s ego and receiving favors from them in return! Hindus stone and mud Gods are nothing more than artifices for earning money without doing any labor and at the expense of gullible people .

   • Dear Mr. Raj, if you had not read it so far, we invite you to read the article “No Caste system in Vedas’ in which Agniveer has debunked many false assumptions prevailing in the society today.

    In general, we thank you for spending time to read on Agniveer site, then sharing your feedback.

    “Satyameva Jayathe”.

    I for one belong to a Khastriya clan some 1000s of years ago, but now is a Brahmin (by virtues, and also based on birth). So the Vedas and our great civilization has given the chance for all of us to change our ‘Varna’ (class/group) which is totally different from the ‘caste system’ that got solidified during British rule.

    Let us not forget that the characters like Sage Valmiki, Sage Ved Vyas, minister Vidhura were not born Brahmins, but became Brahmins by their virtues.

    It is only our actions and our actions alone that decide if we are a Brahmin (Intellectual/Scholar), a Kshatriya (Soldier/King), a Vysya (Merchant/Business man) or a Shudra (Worker/Supporting jobs to other professions).

    I’m a Brahmin by virtues, a Shudra by job (Engineer), and a Kshatriya in terms of educating the society.

 • Thank you all Telugu people for your support. We are doing our best with limited resources for this volunteer work of translating the great articles of Agniveer into Telugu language.

  One great help you could do is to find prospective Telugu people who could do such volunteer service to achieve our noble cause of translating all Agniveer’s articles into Telugu.

  Interested people can contact Agniveer through the contact form below, and they would be redirected to the ‘core team’ working on the translation of these articles.

 • ఇప్పుడు తెలుగు వారికి ఉన్న అనేక సమస్యల్లో హిందువులకు విరుద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారం, హిందువులపై జరుగుతున్నా మానసిక దాడి వంటివి కూడా ఉన్నాయి.

  అగ్నివీర్ వారు ఈ విధంగా తెలుగులో వారి వ్యాసాలను అనువాదం చేయటం చాలా మంచి పని. ఇలాంటివి ఇంకా ఎన్నో వ్యాసాలను వీరు రచించ గలిగే శక్తి ఆ పరమాత్మ సహృదయులకు అందరికీ ఇచ్చి ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

  భారతావనికి, వైదిక ధర్మానికి జయము జయము! సత్యమేవ జయతే!

 • Excellent job by Agniveer and their telugu translation team. We hope to see many more articles like these on this site, in Telugu.

  God bless all those who are taking part in this great yajna. ‘Hari Om’. ‘Jai Hind’

 • అగ్నివీర్ వారు చేస్తున్న మహోన్నత యజ్ఞంలో సఫలీకృతులై, వైదిక ధర్మమునకు, తెలుగు ప్రజలకు ప్రయోజనకారిగా బహుకాలం ఉండెడరని కాంక్షిస్తూ, శుభాశీస్సులతో మనస్పూర్తిగా దీవిస్తున్నాము.

 • Agniveer ji, I’m from Andhra Pradesh. Hats off to you and your team for starting Telugu articles on your site. The two articles we found at the moment are very interesting but are with some typographical errors. I hope your team will review them and will correct them soon.

  And another request, It would be great to see ‘Telugu’ category highlighted just like you have done for other Indian languages.

 • Pranam Agniveer ji , very nice to see Telugu article in Agniveer site. I live in US,with our guru ji blessings we are doing SARVA SHRESHTA ISHVAR PUJA HAVAN , PRACTICING ASHTANGA YOGA every day . We do havan morning and evening. Thank you .

 • Great to see one of the best articles of Agniveer now presented in Telugu. This will provide an opportunity for all Telugu people to share this important information with their Telugu friends all over the world. I for one have sent this information already to many of my friends.

  Keep up the great work Agniveer!